Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారు వెళ్లాకే భోజనం చేయాలి.. మందడం గ్రామస్తులకు ఖాకీల ఆంక్షలు

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (11:36 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారు సచివాలయంలో ఉన్నారు. ఆయన వెళ్లేంత వరకు మందుల షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెరవరాదు. అంతేకాదు.. ఆయన కాన్వాయ్ వెళ్లిన తర్వాతే మీరంతా భోజనాలు చేయాలి. ఇది మందడం గ్రామవాసులకు పోలీసులు ఇచ్చిన వార్నింగ్. ఈ హెచ్చరికలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అమరావతికి రానున్నారు. దీంతో మందడం గ్రామంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. మందుల షాపులతో పదుకాణాలను అన్నింటినీ మూసివేయిస్తున్నారు. మెడికల్ షాపులతో పాటు ప్రాథమిక ఆరోగ్యం, ఇతర షాపులన్నీ తెరచేందుకు వీల్లేదన్న ఆంక్షలు జారీ అయ్యాయి. 
 
అంతేకాకుండా, ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లేన తర్వాతే భోజనాలు చేయాలని పోలీసులు నిబంధన విధించారు. హోటళ్లను కూడా తెరవనీయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. 
 
అయితే, పోలీసులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments