Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు.. అవన్నీ ఆవభూములు?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (09:41 IST)
రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదని స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం రాజధాని కావాలనేవారిది మరుగుజ్జు మనస్తత్వం.. రాజధాని కట్టేందుకు అమరావతి పనికిరాదని.. అవన్నీ ఆవ భూములని చెప్పారు. రాజధాని విషయం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు లాజిక్కు మిస్సయ్యి, అతి తెలివితో తప్పటడుగు వేశారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. 
 
శ్రీకాకుళంలో శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేశారు. దాన్ని హైకోర్టుకు సమర్పిస్తామని స్పీకర్ వెల్లడించారు. సమావేశంలో శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని కోరిన తెదేపా జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా తెదెపా తీర్మానం చేయగలదా అని ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం, విశాఖ రాజధాని సాధనకు అవసరమైతే మరోమారు ఉద్యమాల ఖిల్లాగా మారుతుందని తెలిపారు. 
 
అమరావతి రైతుల పాదయాత్రను సూర్యభగవానుడు సైతం హర్షించలేదన్నారు. రూ.15-20 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుతమైన రాజధానిగా మారుతుందని చెప్పారు. ఈ విషయంపై న్యాయం చేయాలని న్యాయమూర్తులను చేతులెత్తి మొక్కుతున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments