Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:55 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ విపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు రవీంధ్ర బాబు. అమలాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
నిజానికి కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపించారు. కానీ, ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో రాష్ట్రంలో వలస రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 
 
తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంధ్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. సో.. ఆయన కూడా ఏక్షణమైనా వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments