శాండ్ విచ్‌ను దొంగలించిన పార్లమెంట్ సభ్యుడి పదవి ఊడింది. ఇది మనదేశంలో కాదు లెండి. స్లోవేనియాలో. స్లోవేనియా దేశానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకరు ఓ సూపర్ మార్కెట్‌లో శాండ్‌విచ్ దొంగలించిన కారణంగా.. ఆయన్ని పదవి నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. స్లోవేనియాలోని ల్యూపిలియానా అనే ప్రాంతంలోనే ఓ సూపర్ మార్కెట్లో శాండ్ విచ్ కొనేందుకు 54ఏళ్ల తర్జ్ అనే పార్లమెంట్ సభ్యుడు వెళ్లారు.
అయితే ఈ షాపులో శాండ్ విచ్ కొనుక్కొని డబ్బులివ్వకుండా వెళ్తే ఏం జరుగుతుందని.. ఆ షాపులోని భద్రతను పరీక్షించేందుకే శాండ్ విచ్‌ను తీసుకెళ్లానని తర్జ్ అన్నారు. అయితే ఆ దేశ మీడియా మాత్రం బిల్లు కట్టకుండా శాండ్ విచ్ తర్జ్ దొంగలించారని కోడైకూశాయి. కానీ మీడియా ఓవరాక్షన్ చూసి షాకయ్యానని ఒక మూడు నిమిషాలు బిల్లు కట్టేసి వుంటే ఏ బాధా వుండేది కాదని తర్జ్ చెప్పారు. ఈ చర్యపై తర్జ్ క్షమాపణలు చెప్పినా.. ఆయన పార్లమెంట్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.