Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అల్లు వర్ధంతి వేడుకలు : ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం...

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:32 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పేరెన్న‌ద‌గ్గ హాస్య న‌టుల్లో ఒకరు పద్మశ్రీ అల్లు రామ‌లింగ‌య్య ఒకరు. ఈయన హాస్య నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన గత 2004 జూలై 31వ తేదీన దివికేగారు. అయితే, ఈయన వర్థంతి వేడుకలు శుక్రవారం జూలై 31వ తేదీన జరుగుతున్నాయి. అల్లు వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ స‌భ్యులు, సినీ ప్రియులు ఆయ‌న్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్మ‌రించుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ 'ఇదే రోజు ఆయ‌న మ‌మ్మ‌ల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయ‌నేంటో, ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభ‌వాల కంటే, ఆయ‌న ఎఫ‌ర్ట్స్‌, ప్ర‌యాణం, ఆయ‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌కు నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమాల‌పై ఓ పేద రైతుకున్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు ఒకటో తేదీన జన్మించగా, 2004 జూలై 31వ తేదీన చనిపోయారు. వచ్చే యేడాది అంటే 2021 నుంచి 2022ని శతజయంతి సంవత్సరంగా కొనియాడేందుకు అల్లు, మెగా ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments