Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:22 IST)
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో కిక్కుకోసం శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. వివరాలిలా వున్నాయి... కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉండే నలుగురు యాచకులు, మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో మద్యం ధరలు పెరిగాయి.
 
ఫలితంగా వారు గత కొద్దిరోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నారట. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఇటు కురిచేడులో రమణయ్య శానిటైజర్‌తో పాటు నాటు సారా కలిపి తాగడంతో మరణించాడు.
 
అదే జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. ఒకే యాచక బృందానికి చెందిన వీరంతా వేరువేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మత్తుపై వీరికున్న మోజు మరణానికి దారితీసింది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments