Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (10:47 IST)
పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత వక్రమార్గంలో నడవసాగాడు. భర్తను సక్రమ మార్గంలో పెట్టేందుకు భార్య సాహసం చేయలేకపోయింది. పైగా, భార్యనే నిత్యం వేధింపులకు గురిచేయసాగాడు. ఈ వేధింపులను భరించలేని భార్య ఉరేసుంది. ఈ కారణంగా ఓ చిన్నారి తల్లి ప్రేమకు దూరమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా అంటూ ఆ చిన్నారి బోరున విలపిస్తుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని ఆదోనీ పట్టణంలోని విక్టోరియాపేటలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విక్టోరియాపేటకు చెందిన శ్వేత అదే కాలనీకి చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఎవరికీ చెప్పకుండా మూడున్నరేళ్ల కిందట వివాహం చేసుకొన్నారు. నాగరాజు ఓ నూనె దుకాణంలో గుమాస్తాగా చేరగా.. శ్వేత ఓ లేడీస్ కార్నర్‌లో పనికి చేరారు. వీరికి రెండేళ్ల కుమార్తె మౌఖిక ఉంది. 
 
నాగరాజు అతిగా మద్యం తాగుతూ పనికి సరిగా వెళ్లకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వేతను నాగరాజు తరచుగా వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె సోమవారం అర్థరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొందని ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతితో రెండేళ్ల కుమార్తె మౌఖిక అనాథగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments