పాము కాటేసి వెళ్లిపోయింది.. దానికోసం వెతికి ప్రాణం పోయింది...

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:54 IST)
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా కాలయాపన చేయడం వల్లనే ఎంఏ విద్యార్ధి మృతి చెందినట్లు తెలుస్తోంది. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఆ ఇద్దరూ పాము కోసం వెతకడం ప్రారంభించారు. 
 
అయితే మయన్మార్‌లో ఎవరైనా పాము కాటు వేస్తే, దానిని చంపి దాంతో పాటే ఆసుపత్రికి వెళుతారట. అంతేకాకుండా ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారట. దాని కోసం వెతుకుతూ.. ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. 
 
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్‌ 7వ తేదీన మయన్మర్‌కి చెందిన కొండన్న (38) అనే బుద్ధిజం విద్యార్ధి రాత్రి 10.30 గంటల సమయంలో క్యాంపస్‌లో పుట్టగొడుగుల సేకరణ కోసం చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్త పింజరి పాము కొండన్నను కాటు వేసింది. పాముకోసం వెతుకుతూ కాలయాపన చేయడంతో  కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments