Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్, ఎంపియుపిఎస్ హిమాయత్ సాగర్ స్కూల్ విద్యార్థులకు LG ఎలక్ట్రోనిక్స్ పోషకాహార భోజనాలు

image

ఐవీఆర్

, శనివారం, 31 ఆగస్టు 2024 (22:39 IST)
LG ఎలక్ట్రోనిక్స్ ఇండియా హైదరాబాద్‌లో MPUPS హిమాయత్ సాగర్ స్కూల్‌లో ప్రత్యేకమైన కార్యక్రమంతో తమ ఫ్లాగ్ షిప్ లైఫ్స్ గుడ్ న్యూట్రిషన్ ప్రోగ్రాం కోసం ఈ ఏడాది కార్యకలాపాలను ప్రారంభించింది. ద అక్షయ పాత్ర ఫౌండేషన్, అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం ప్రోగ్రాం యొక్క 2024 దశ ప్రారంభానికి గుర్తుగా నిలిచింది, ఇది అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల విద్యాపరమైన, పోషకాహార సంక్షేమాన్ని పెంపొందించడంపై దృష్టిసారిస్తుంది.
 
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సృజనాత్మకతను ప్రేరేపించి, కమ్యూనిటీ భావనను ప్రోత్సహించడానికి రూపొందించిన వివిధ కార్యకలాపాలలో పాల్గొన్నారు. పిల్లలు రంగులు వేయడం, చిత్ర లేఖనం సమావేశాల్లో పాల్గొన్నారు. తమ కళాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి ప్రతి విద్యార్థికి కలరింగ్ క్రేయాన్లు కేటాయించబడ్డాయి. పోషకాహార భోజనాల వడ్డన, బహుమతుల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. యువ విద్యార్థుల ఆరోగ్యం, సాధనలకు మద్దతు చేయడానికి అవసరమైన పోషకాహారం కేటాయించే ప్రోగ్రాం యొక్క కీలకమైన మిషన్‌కు ప్రాధాన్యతనిచ్చింది.
 
LG వారి లైఫ్స్ గుడ్ న్యూట్రిషన్ ప్రోగ్రాం కింద కార్యక్రమం నిర్వహించబడింది, ఇది 2019లో ప్రారంభించబడింది. భారతదేశంవ్యాప్తంగా పిల్లల పోషకాహార హోదాను మెరుగుపరచడంలో ఇది కీలకంగా నిలిచింది. వారి పూర్తి అభివృద్ధి, అకాడమిక్ విజయానికి తోడ్పడుతోంది. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ అనుసంధానంలో, ప్రోగ్రాం జీరో హంగర్, మంచి ఆరోగ్యం & సంక్షేమం, నాణ్యతతో కూడిన చదువు, తగ్గిన అసమానతలపై దృష్టిసారిస్తుంది. ఇది ఆరంభమైన నాటి నుండి. ప్రోగ్రాం గణనీయంగా విస్తరించింది, 2024లో, ఇది దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది విద్యార్థులను చేరుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బీభత్సం, ముగ్గురు మృతి (Video)