Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ విద్యార్థులపై ఆర్థిక పిడుగు... కెనడా సర్కారు కీలక నిర్ణయం!

Canada PM

ఠాగూర్

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:14 IST)
కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది భారతీ విద్యార్థులపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపనుంది. ఆ దేశంలో పని చేసే విద్యార్థులు తమ ప్యాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ పని చేసుకునే అవకాశం లేకుండా చేసింది. క్యాంపస్ వెలువల వారానికి 24 గంటలకు మించి పని చేయరాదన్న కొత్త నిబంధన విధించింది. ఈ నిర్ణయం కూడా ఈ వారం నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది కెనడాలో ఉంటున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఆ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న భారత విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చనుంది. 
 
కెనడా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిని నిబంధనల కారణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్షలాది మంది విదేశీ విద్యార్థులకు, ప్రధానంగా అధిక సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తేనుంది. కాగా, గతంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది. అయితే, కరోనా సంక్షోభ సమయంలో ఆ దేశంలో కార్మికుల కొరత ఏర్పడటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తి వేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.
 
అయితే, అంతర్జాతీయ విద్యార్థుల కోసం కెనడాలో వేసవి లేదా శీతాకాలం సెలవుల సమయంలో పని గంటలపై ఎటువంటి పరిమితులు ఉండవు. ఇదిలాఉంటే.. 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 2.26 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండటం గమనార్హం. సుమారు 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించడం జరుగుతోంది. 
 
ఇక క్యాంపస్ వెలుపల ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం భారతీయ విద్యార్థులకు వారి కిరాణా, వసతి ఖర్చులకు ఉపయోగపడుతుంది. కాగా, అక్కడ చాలా స్టాండర్డ్ వర్క్ షిఫ్టులు 8 గంటల నిడివితోనే ఉంటాయి. దాంతో ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు వారానికి మూడు పార్ట్- టైమ్ షిఫ్టుల వరకు మాత్రమే పని చేయగలరు. దీని వలన వారు తమ అదనపు ఖర్చులను భరించడం కష్టమవుతుందని విద్యార్థులు వాపోతున్నారు.
 
ఇక ఇప్పటికే కెనడా సర్కార్ వలస విధానాలను మార్చడంతో పాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించిన విషయం తెలిసిందే. అటు శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులను కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు క్యాంపస్ వెలుపల జాబ్స్పై పరిమితి విధించడంతో వారి కష్టాలు రెట్టింపు అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా!