Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు బుద్ధి చెప్పాలని, అతని ముందే బాయ్ ఫ్రెండ్స్‌తో అలా...

పెళ్ళి చేసుకున్న భార్యను కాదని ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న భర్తకు తగిన బుద్ధి చెప్పిందో భార్య. అది కూడా అలాఇలా కాదు.. మళ్ళీ ప్రియురాలి జోలికి వెళ్ళకుండా. ఎపిలోని విశాఖకు అతి సమీపంలోని అరకులో జరిగిన ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (14:14 IST)
పెళ్ళి చేసుకున్న భార్యను కాదని ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న భర్తకు తగిన బుద్ధి చెప్పిందో భార్య. అది కూడా అలాఇలా కాదు.. మళ్ళీ ప్రియురాలి జోలికి వెళ్ళకుండా. ఎపిలోని విశాఖకు అతి సమీపంలోని అరకులో జరిగిన ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
అరకుకు చెందిన తులసి, శ్రీకాకుళం చెందిన వనజకు పెద్దలు నెల క్రితం వివాహం చేశారు. పెళ్ళయినప్పటి నుంచి భార్య ఫోన్ నెంబర్ మార్చేయమన్నాడు భర్త. స్లీవ్‌లెస్ డ్రస్‌లు, జాకెట్లకు రంధ్రాలు ఉండటం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం అన్నీ మానుకోవాలన్నాడు. ఫేస్ బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయమని ఇలా అన్నీ మానేయమన్నాడు. దీంతో వనజ అన్నింటినీ వదులుకుంది. నెల రోజుల వరకు భార్యను బాగానే చూసుకున్నాడు.
 
ఆ తరువాత అసలు కథ మొదలైంది. పెళ్ళి కాకముందు తులసి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో మళ్ళీ పరిచయం పెట్టుకున్నాడు. ఫోన్లు, ఛాటింగ్‌లు ఇలా గర్ల్ ఫ్రెండ్‌తో బిజీ అయిపోయాడు. జరుగుతున్నదంతా చూసిన భార్య, భర్తను వేడుకొంది. ఇదంతా ఆపేయమంది. అయితే అతను ఒప్పుకోలేదు. దీంతో వనజ కూడా ఒకడుగు ముందుకు వేసింది. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. ఫేస్ బుక్ అకౌంట్‌ను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది. 
 
గతంలో తనకు ఉన్న పరిచయాలతో బాయ్ ఫ్రెండ్లతో చాటింగ్ మొదలెట్టింది. ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం ప్రారంభించింది. పరిచయం లేని వ్యక్తులతోను గంటల తరబడి మాట్లాడేది. ఇలా భర్తకే విసుగు తెప్పింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వచ్చేవి. అయినా వనజ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో భర్తే సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్ల్ ఫ్రెండ్‌ను వదిలేశాడు. భార్యను బుజ్జగించాడు. ఇలా తన భర్త తనకు బాగా దగ్గరయ్యాడని, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదంటోంది వనజ. ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది వనజ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments