Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభిన్న ప్రతిభావంతులకు వెయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (06:15 IST)
రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను విభిన్న ప్రతిభావంతులతో భర్తీ చేయను న్నట్లు విభిన ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఆధారంగా వివిధ శాఖల్లోని ఖాళీలను విభిన్న ప్రతిభావంతులతో పూరించనున్నామన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ, పాఠశాల, కాలేజీ విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం తదితర శాఖల్లో 668 బ్యాక్ గ్ ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 62, శాఖాధిపతుల ద్వారా 239, డీఎస్సీ ద్వారా 178, ఉపాధ్యాయ డీఎస్సీ ద్వారా 189 ఖాళీల భర్తీకి తొందరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

వాస్తవానికి 2019 జూన్ నెల నుండి ఇప్పటి వరకు 629 ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు శుక్లా తెలిపారు. వీటిలో ఎపిపిఎస్ సి ద్వారా 106 ఖాళీలు, డిఎస్ సి ద్వారా 523 ఖాళీలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. వీటిలో ఎపిపిఎస్ సి ద్వారా 45 ఖాళీలు భర్తీ చేయగా 61 ఖాళీలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయన్నారు.

మరోవైపు డిఎస్ సి ద్వారా 137 ఖాళీలు భర్తీ చేయగా 386 ఖాళీల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ఉందన్నారు. ఈ క్రమంలో మొత్తంగా విభిన్న ప్రతిభావంతులు కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యిందని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అర్హత కలిగిన విభిన్న ప్రతిభావం తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని స్థిరపడాలని శుక్లా తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments