Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువకుడితో ప్రేయసి... తట్టుకోలేక ఉరి వేసుకున్న ప్రియుడు

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (20:42 IST)
ప్రాణం కంటే మిన్నగా ఓ యువతిని ప్రేమించాడు ఆ యువకుడు. కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేసింది ఆ ప్రియురాలు. మనస్థాపం చెందాడు ఆ యువకుడు. ప్రియురాలు లేని జీవితం వద్దనుకున్నాడు. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ ప్రేమికుడు.
 
వివరాలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌కు చెందిన సోనోరావు హైదరాబాద్ బోయిన్ పల్లి సిక్ విలేజ్‌లో తన మిత్రుడితో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు సోనోరావు. కొన్నాళ్ల తర్వాత సోనోరావుని అలక్ష్యం చేసింది ఆ యువతి. దాంతో తీవ్ర ఆవేదనకు గురయ్యేవాడు. 
 
ప్రేమించిన యువతి కాదనడంతో పాటు.. మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతుందన్న విషయం తెల్సుకుని ఖంగుతిన్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ యువతి దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. దాంతో జీవితంపై విరక్తి చెందాడు. ప్రియురాలు లేని జీవితం వద్దనుకుని గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు సోనోరావు. 
 
ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. గది తాళాలు పగులగొట్టి.. లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యానుకి సోనోరావు మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ సోనోరావు మృతదేహాన్ని కిందకు దింపారు పోలీసులు. క్లూస్ టీమ్ పోలీసులు చేరుకుని ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. 
 
ప్రేమ విఫలమై సోనోరావు బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెల్సుకున్న అతని కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత ఎదిగిన కుమారుడు చివరికి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments