Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో కత్తితో యువతి హల్‌చల్.. ఎవరిని బెదిరించిందో తెలిస్తే షాకే...

కడప జిల్లాలో ఒక యువతి కత్తితో హల్చల్ చేసింది. తనకు సంబంధించిన భూములపై విచారణ చేసేందుకు వచ్చిన రెవిన్యూ, పోలీసుల అధికారులను కత్తితో చంపేస్తానని బెదిరించింది. యువతి చేస్తున్న రాద్దాంతం చూసి పోలీసులే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. చిట్వేలు మండలం కందులవారిప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (11:30 IST)
కడప జిల్లాలో ఒక యువతి కత్తితో హల్చల్ చేసింది. తనకు సంబంధించిన భూములపై విచారణ చేసేందుకు వచ్చిన రెవిన్యూ, పోలీసుల అధికారులను కత్తితో చంపేస్తానని బెదిరించింది. యువతి చేస్తున్న రాద్దాంతం చూసి పోలీసులే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. చిట్వేలు మండలం కందులవారిపల్లిలో అనసూయమ్మకు 8 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలం పక్కనే స్మశానం కూడా ఉంది.
 
అనసూయమ్మ తన స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ స్మశానాన్ని కూడా కొంత ఆక్రమించేసి కంచె కట్టింది. కొంతమంది స్థానికుల ఫిర్యాదుతో రెవిన్యూ అధికారులు విచారణ చేసేందుకు అనసూయమ్మ పొలం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న అనసూయమ్మ ఆమె మనవరాలు కవిత తమ స్థలం వద్దకు కత్తి పట్టుకుని వచ్చింది.
 
ఈ భూముల్లో కొంత మీరు ఆక్రమించారు. మీ స్థలం ఇది కాదంటూ రెవిన్యూ అధికారులు చెబుతుండగా కవిత కత్తితో రెవిన్యూ అధికారులను బెదిరించింది. ఎవరైనా స్థలంలోకి వస్తే నరికేస్తానంటూ బెదిరింపులకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా స్థలం వద్దకు చేరుకున్నారు. పోలీసులను కూడా కవిత బెదిరించడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. యువతిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments