Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 70 శాతం ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు : కేఏ పాల్

Webdunia
గురువారం, 4 మే 2023 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల్లో 70 శాతం మంది తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో ఆదాయం పెరగలేదుగానీ అప్పులు బాగా పెరిగిపోయాయని అన్నారు. మంత్రి బొత్సకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని తెలిపారు. అందువల్ల ఆయన ఆస్తులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితో ఏపీని ముంగేస్తాడని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని ఆయన ప్రశ్నించారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానని చెప్పారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. వైకాపాలోని అవినీతిపరులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments