Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎస్వీ జూలో మూడేళ్ల బాలుడు మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (14:50 IST)
తిరుపతిలో ఎస్వీ జూ పార్కులో విషాదకర ఘటన ఒకటి జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ. తిరుపతిలో ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, పిల్లలకు వేసవి సెలవు ఇవ్వడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడిని కుమారుడిని తిరుపతిలో ఎస్వీ జూ పార్కుకు విహారానికి తీసుకెళ్ళారు. 
 
జూ పార్కులో ఒక చేత్లో కన్నబిడ్డను, మరో చేత్తో మేనల్లుడుని పట్టుకుని నడిచి వెళుతుండగా, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. బ్యాటరీ వాహనం చక్రాలు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన జూ పార్కు సిబ్బంది హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటివరకు తన ముందే ఉన్న కుమారుడు చనిపోయాడని తెలియడంతో తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాటరీ వాహన డ్రైవర్‌ అజాగ్రత్త, వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments