Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రతిరోజు 500 కేసులు, మహారాష్ట్ర భక్తులే కారణమా?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (18:14 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిని కరోనా వణికిస్తోంది. గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల ముందు వరకు కేవలం 40 నుంచి 50 వరకు మాత్రమే ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెరుగుతున్న కరోనా కేసులతో తిరుపతి ప్రజలు వణికిపోతున్నారు. 
 
గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు 500కి చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈరోజు 740 పాజిటివ్ కేసులు, నిన్న 496 కేసులు, మొన్న 465 కేసులు. ఇలా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
 
అలాగే చిత్తూరు, శ్రీకాళహస్తి, పలమనేరులలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులకే కాదు భక్తుల్లోను ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి ఆఫ్‌లైన్లో టోకెన్లను నిలిపివేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
మహారాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్న దృష్ట్యా టిటిడి కూడా అప్రమత్తమవుతోంది. శానిటైజర్లను భక్తులకు అందిస్తోంది. మాస్క్‌లను తప్పనసరి చేసింది. కాగా తిరుపతిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవడం వెనుక మహారాష్ట్ర నుంచి వస్తున్న భక్తులే కారణమన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments