Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమావేశాలకు అడ్డు తగులుతున్నారనీ... టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులు అనేక ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారు. దీంతో ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. 
 
ఈ సస్పెన్షన్‌కు గురైన వారిలో బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల కిష్టప్ప, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులు ఉన్నారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న ఏకైక కారణంతోనే వీరిని సస్పెండ్ చేశారు. ఈ ఐదుగురు సమావేశాలు ముగిసేంతవరకు సభకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహించాలని ఆయన కోరారు. మరోవైపు, తమ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేయడంతో మిగిలిన టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments