Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 47 కార్పొరేషన్ల‌కు 481 మంది డైరక్టర్ల ప్రకటన

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (15:02 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేకతోటి సుచరిత, ఎంపి నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు కొత్త ప‌ద‌వుల ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో 47 కార్పొరేషన్ల‌కు 481 మంది డైరక్టర్లను ప్రకటించారు. 
 
ఈ సంద‌ర్భంగా బిసి సంక్షేమశాఖ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీనవర్గాలకు జగన్మోహన్ రెడ్డి పాలన సువర్ణాధ్యయం అన్నారు. సామాజిక న్యాయానికి భారతదేశ చరిత్రలో ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత పాలకుడు ప్రకటనలకు ,ప్రచారాలకు తప్ప చేసింది ఏమి లేద‌న్నారు. 
 
విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ నామినేటెడ్ డైరెక్టర్ల ఎంపిక పక్రియ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.  దాదాపు 481 డైరెక్టర్ల పేర్లను ప్రకటిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా 47 కార్పొరేషన్ల నియామకాలను కూడా చేపడుతున్నట్లు ప్రకటించారు.

డైరెక్టర్ల నియామకాల్లో సామాజిక న్యాయం ఉండలాని సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి లిస్ట్ తయారు చేశామన్నారు. ఈ నియామకాల్లో 52 శాతం మహిళలకు, 48 శాతం పురుషులకు ఇవ్వడం జరిగింది. బీసీ, ఎస్సి, ఎస్టీ లకు 58 శాతం, ఓసి లకు 42 శాతం కేటాయించినట్లు తెలిపారు. ఈ రోజు డైరెక్టర్ల నియామకాల్లోనూ మహిళలకు పెద్ద వేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టంచేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments