Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాన్ష్ పేరిట శ్రీవారి అన్నదానం ట్రస్టుకు 30 లక్షల విరాళం

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:21 IST)
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ నెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు రానున్నారు.

ఈ నేపథ్యంలో అన్నదానం ట్రస్టుకి 30 లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా అన్నదానానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు విరాళమిస్తున్నారు. 
 
14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు
ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్‌లో టిక్కేట్లను బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే ప్రస్తుతం ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించనుంది.

ఏడాది కాలానికి సంబంధించి 28258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6468 తోమాల సేవా టిక్కెట్లు, 6808 అర్చన సేవా టిక్కెట్లు, 2124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు, 2136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు.

వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేష పూజలు.... ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించాలని పాలకమండలి తీర్మానించింది. ప్రతి నిత్యం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తూనందున.. విగ్రహాలకు అరుగుదల సంభవిస్తుందని అర్చకులు తెలిపారు.

ఈ క్రమంలో ఆగమపండితులు, ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments