Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:35 IST)
కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇవి శృతిమించడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలోని హోజాయ్ జిల్లాలో ఓ జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ బంధువు ఈ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉండిపోయారు.
 
ఈ దాడిలో మొత్తం 24 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వారిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఘటనపై అస్సాం ఐఎంఏ విభాగం ఆందోళనకు దిగింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments