Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె..

Advertiesment
తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె..
, మంగళవారం, 25 మే 2021 (22:36 IST)
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరసన తెలిపేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు.
 
జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూనియర్ డాక్టర్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నారు. తమకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనందయ్య మందు: కరోనా రాకుండానే మింగేశారట చాలామంది, ఇక ఇప్పట్లో పంపిణీ లేనట్లేనా?