Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 18న 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (08:59 IST)
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మార్చి 18వ తేదీ 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.
 
గురువారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను పారాయణం చేస్తారు.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా ఇప్పటివరకు టిటిడి పది అఖండ పారాయ‌ణాలను విజయవంతంగా నిర్వహించింది.
 
శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments