Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11వ తేదీ నుండి రాయదుర్గం మీదుగా బెంగళూరు- హోసపేట ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు

Advertiesment
11వ తేదీ నుండి రాయదుర్గం మీదుగా బెంగళూరు- హోసపేట ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు
, శనివారం, 6 మార్చి 2021 (19:17 IST)
ఈనెల 11వ తేదీ నుండి బెంగళూరు నుండి తుమకూరు, రాయదుర్గం, బళ్ళారి మీదుగా హోస్పేటకు ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది.
 
వీటిలో ట్రైన్ నెంబర్ 06243 మార్చి 11వ తేదీ ఉదయం ఐదు గంటలకు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరి తుంకూర్ మీదుగా రాయదుర్గంకి మధ్యాహ్నం 11:53 గంటలకు చేరుకొని 11:55కు బయలు దేరుతుంది. బళ్లారికి 01:45 చేరుకుని 01:55కి బయలుదేరి 3-45 హోసపేట రైల్వేస్టేషనుకు చేరుకుంటుంది.
 
ట్రైన్ నెంబర్ 06244 మార్చి 12వ తేదీన హోస్పేట స్టేషన్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 1:30కి బళ్లారి స్టేషన్ చేరుకుంటుంది అక్కడ 1:40కి బయలుదేరి రాయదుర్గం స్టేషనుకి 2:48కి చేరుకుని 2:50కు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 10:45కు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ చేరుకుంటుంది. సాధారణ ఛార్జీలతో నడిచే ఈ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడుపబడుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ లేఖ.. ట్విట్టర్‌లో వైరల్