Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గిన ఏపీ.. 12వ తరగతి పరీక్షలు కూడా..

Webdunia
గురువారం, 27 మే 2021 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. క‌రోనా స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసినా… ఏపీ ప్ర‌భుత్వం పరీక్షల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపుతుంద‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
 
క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌టం లేద‌ని, పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి ఇప్ప‌టికి ఇప్పుడు స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 
 
టీచర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో స‌మీక్ష చేసి, తుది నిర్ణ‌యం తీసుకోనుంది. కాగా, ఏ పరీక్షలను నిర్వహించి తీరుతామని పదేపదే చెబుతూ వచ్చిన ఏపీ విద్యా శాఖ.. హైకోర్టుకు మాత్రం ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలపడం గమనార్హం. అలాగే, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం