Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సునామీ : నాలుగో అతిపెద్ద పార్టీగా వైకాపా

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైకాపా 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, 22 లోక్‌సభ సీట్లలో గెలుపొందింది. ఫలితంగా సత్తాచాటి.. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తర్వాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా అవతరించింది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్‌ పార్టీకి 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తర్వాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, తెరాస 9, ఎస్పీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నాడీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments