Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట : వైఎస్.షర్మిల

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (17:01 IST)
అమ్మకు అన్నం పెట్టడుగానీ, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అన్న చందంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి ఉందని వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆమె శనివారం గుంటూరు సిటీలో జరిగిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా.. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని నారా చంద్రబాబు నాయుడు ఇప్పడు మరొక్కసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వామనడం విడ్డూరంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 
 
రైతు రుణమాఫీ పేరుతో బాబు రైతున్నలను మోసం చేశారని, ఇటు డ్వాక్రా మహిళలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారని విమర్మించారు. కాగా ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ ఆ జాబు బాబు కుమారుడు లోకేష్‌కే వచ్చిందనీ, రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఒక్కరికీ కూడా జాబు రాలేదన్నారు. 
 
ఇకపోతే, పప్పు బాబుకు వర్ధంతికి, జయంతికి తేడా తెలియదన్నారు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా మూడు శాఖలకు మంత్రి అయ్యారు. బాబుది రోజుకో మాట.. పూటకో వేషం అని ఎద్దేవా చేశారు. బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందన్నారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదు.. సింహం సింగిల్‌గానే వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments