Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు సొంత జిల్లాలో రెబల్స్ బెడద.. గెలుపు సాధ్యమా...?

చంద్రబాబుకు సొంత జిల్లాలో రెబల్స్ బెడద.. గెలుపు సాధ్యమా...?
, శుక్రవారం, 29 మార్చి 2019 (12:52 IST)
చంద్రబాబు సొంత జిల్లాలో రెబల్స్ బెడద ఎక్కువైంది. మూడు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. టిడిపి గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి రావడంతో నష్టనివారణ చర్యలపై దృష్టిపెట్టింది హైకమాండ్.
 
చిత్తూరుజిల్లాలో మంత్రి అమరనాథరెడ్డి పోటీ చేస్తున్న పలమనేరులో సుభాష్ చంద్రబోస్ టిడిపి రెబల్‌గా నామినేషన్ వేశారు. చంద్రబాబు స్వయంగా బోస్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినా పార్టీలోకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్థమయ్యారు. టిడిపికి మంచి పట్టున్న మదనపల్లిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌కు టిక్కెట్టు ఇవ్వడాన్ని రాందాస్ చౌదరి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాందాస్ చౌదరితో పాటు బోడేపాటి శ్రీనివాసులు, మల్లిఖార్జుననాయుడు వర్గం విబేధిస్తున్నారు. 
 
రాందాస్ భార్య గంగారపు స్వాతి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. మరోవైపు శ్రీరాములు కూడా నామినేషన్ స్వతంత్ర్య అభ్యర్థిగా వేశారు. మరోవైపు తంబళ్ళపల్లిలో శంకర్ యాదవ్ సీటు ఇవ్వొద్దంటూ దొరస్వామినాయుడు వ్యతిరేకించారు. అయితే శంకర్ యాదవ్‌కే సీటు ఇవ్వడంతో దొరస్వామినాయుడు స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 
శ్రీకాళహస్తిలో ఎస్సివి నాయుడు అలక పాన్పు వీడలేదు. సత్యవేడులో జె.డి.రాజశేఖర్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదట. ఇలా జిల్లాలో చంద్రబాబుకు రెబల్స్ బెడదతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓఎన్‌జీసీలో 785 ఖాళీలు.. దరఖాస్తుల ఆహ్వానం.. గేట్ స్కోర్ ఆధారంగా?