Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్చూరు పోరు : దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్సెస్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు

Advertiesment
పర్చూరు పోరు : దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్సెస్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు
, మంగళవారం, 26 మార్చి 2019 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అలాంటి నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం ఒకటి. ఈ స్థానంలో సుధీర్ఘ కాలం తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. పైగా, వైకాపా తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఈయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం వైజాగ్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 
 
అయితే, ఒకే పేరుతో ఇద్దరు నేతలు, ఒకే చోట నుంచి పోటీ చేసి, వీరు పోటీ చేసే పార్టీల గుర్తులు కూడా ఇంచుమించు ఒకేలా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చాలాకాలం తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తుండటంతో ఈ స్థానంపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమైవుంది. 
 
అయితే, నియోజకవర్గంలో దాదాపు ఇదే పేరుతో మరో నేత బరిలో ఉండటం ఆయన అనుచరులను కలవరపెతుతోంది. వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నామినేషన్‌ వేశారు. పేర్లు దగ్గరగా ఉండటం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్, హెలికాఫ్టర్) కూడా ఒకేలా ఉండడంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ షర్మిల టార్గెట్.. యూట్యూబ్‌లో అభ్యంతరకర పోస్ట్.. అరెస్ట్