లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మరికొన్ని గంటల్లో రానున్నాయి. దీంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. అసలు ఏం జరుగనుంది..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? కేంద్రంలో బీజీపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందా..? లేక కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందా..? ఇక ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? లేక జగన్ అధికారం కైవసం చేసుకుని సిఎం అవుతారా..? అనే ఉత్కంఠ ఏర్పడింది.
ఎగ్జిట్ పోల్స్ ఎవరికి తోచినట్లు వారు చెప్పేశారు. లగడపాటి రాజగోపాల్ మళ్లీ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం కాబోతున్నారని ప్రకటించగా మిగిలిన జాతీయ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ వెల్లడించాయి. మరి ఎవరు విజయం సాధిస్తారన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.