Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ లోక్‌సభ బరిలో లక్ష్మీనారాయణ.. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:00 IST)
విశాఖపట్టణం లోక్‌సభ స్థానానికి సీబీఐ మాజీ జేడీ వి.లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఈయన జనసేన పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. మంగళవారం విశాఖ లోక్‌సభ బరిలో వి.లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని స్పష్టం చేసింది. 
 
ఇకపోతే, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తమ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి చోటు దక్కని విషయం తెలిసిందే. దీంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్పీవై రెడ్డితో జనసేన అధిష్టానం సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్పీవై రెడ్డిని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. 
 
ఇకపోతే, ఇటీవల జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ మాజీ ఉపకులపతి రాజగోపాల్‌ను అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. కానీ, ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఆయనకు పార్టీలో ఉన్నతమైన పదవిని ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments