సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసే శాసనసభ, లోక్‌సభ సభ్యులను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ప్రటించారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లతో పాటు.. 25 లోక్‌సభ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు.
ఇడుపులపాయలో జగన్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పలువురు హర్షం వ్యక్తంచేస్తుండగా, టిక్కెట్లు ఆశించిన భంగపడిన నేతల ప్రాంతాల్లో కాస్త అలజడి చెలరేగింది. 2014 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 42 మందికి జగన్ మరో ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ తరఫున సిట్టింగ్ స్థానాలను మళ్లీ దక్కించుకున్న అభ్యర్థులు వీరే..
బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి- డోన్
జగన్ మోహన్ రెడ్డి - పులివెందుల
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పుంగనూరు
చెవిరెడ్డి భాస్కరరెడ్డి - చంద్రగిరి
ఆర్.కె.రోజా- నగరి
తిప్పేస్వామి- మడకశిర
రఘురామిరెడ్డి - మైదుకూర్
రాచమల్లు శివ ప్రసాద రెడ్డి- ప్రొద్దుటూరు
ఐజయ్య- నందికొట్కూర్ (ఎస్సీ)
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(కొడాలి నాని) - గుడివాడ
కోన రఘుపతి - బాపట్ల
ఆళ్ల రామకృష్ణారెడ్డి - మంగళగిరి
దేశాయ్ తిప్పారెడ్డి - మదనపల్లె
మేకపాటి గౌతమ్ రెడ్డి - ఆత్మకూరు
ప్రతాప కుమార్ రెడ్డి - కావలి
అనిల్ కుమార్ యాదవ్ - నెల్లూరు సిటీ
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి - నెల్లూరు రూరల్
బాలనాగిరెడ్డి - మంత్రాలయం
సాయి ప్రసాదరెడ్డి- ఆదోని
కంభాల జోగులు - రాజాం (ఎస్సీ)
విశ్వసరాయి కళావతి - పాలకొండ (ఎస్టీ)
పి. జయరాం- ఆలూరు
ముత్యాల నాయుడు- మాడుగుల
పాముల పుష్ప శ్రీవాణి - కురుపాం(ఎస్టీ)
విశ్వేశ్వరరెడ్డి - ఉరవకొండ
రాజన్న దొర- సాలూరు(ఎస్టీ)
రామచంద్రారెడ్డి - పీలేరు
మేకా ప్రతాప అప్పారావు- నూజివీడు
కె.నారాయణ స్వామి- గంగాధర నెల్లూరు (ఎస్సీ)
దాడిశెట్టి రాజా- తుని
చీర్ల జగ్గిరెడ్డి - కొత్తపేట
రక్షణనిధి - తిరువూరు(ఎస్సీ)
అంజాద్ బాష - కడప
గడికోట శ్రీకాంత్ రెడ్డి - రాయచోటి
కోరుముట్ల శ్రీనివాసులు- కోడూరు (ఎస్సీ)
రవీంధ్రనాథ్ రెడ్డి - కమలాపురం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి- మాచర్ల
మహ్మద్ ముస్తఫా- గుంటూరు తూర్పు
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి - నరసారావుపేట
ఆదిమూలపు సురేష్ - సంతనూతలపాడు (ఎస్సీ) / ఎర్రగొండపాలెం
కాకాణి గోవర్థనరెడ్డి- సర్వేపల్లి
కిలివేటి సంజీవయ్య- సూళ్లురుపేట