Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్, ఫ్లాప్స్‌తో పాటు వివాదాలకు తెరలేపిన 2024 తెలుగు సినిమా రంగం

డీవీ
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (12:22 IST)
Vivadala celebraties
తెలుగు చలనచిత్రరంగంలో సక్సెస్ లు, ఫెయిల్యూర్ లతోపాటు వివాదాలు కూడా జరగడం  2024 ఏడాది ప్రత్యేకం. వ్యక్తిగతంగానూ, రాజకీయ పార్టలపరంగానూ, డ్రెగ్ విషయాల్లోనూ సినీ ప్రముఖులు రకరకాలుగా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఫ్యామిలీపరంగానూ, అసలు సంఘటనకు సంబందంలేని వివాదాలు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వివాదం హైలైట్ అయింది. అయ్యప్ప మాలలో వుండి కడప దర్గాను సందర్శించిన రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో విమర్శలు మాత్రమే వచ్చాయి. ఇంకా పలువురు సెలబ్రిటీలపై వచ్చిన వివాదాలు ఏమిటో చూద్దాం.
 
ఏడాది ఆరంభంలోనే ఉయ్యాల జంపాల ఫేమ్ రాజ్ తరుణ్ వ్యక్తిగత వైవాహిక జీవితం వెలుగులోకి వచ్చింది. లావణ్య అనే అభిమానితో కొన్నాళ్ళపాటు సహజీవం చేసి షడెన్ గా బాలీవుడ్ నటీమణి మాల్వీ మల్హోత్రాతో సహజీవనం చేయడంతో ఒక్కసారిగా వివాదమైంది. రాజ్ తరుణ్ నావాడు అంటూ ముంబైలో వున్న రాజ్ తరున్‌పై గొడవ చేసింది లావణ్య. ఈ ఎపిసోడ్ సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ఎపిసోడ్‌ను తలపించింది.
 
Vivadala celebraties-1
ఇక రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న మాల్వీ మల్హోత్రా కూడా, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని రాజ్ తరుణ్ లైఫ్‌లోంచి వెళ్లకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక లావణ్య డ్రెగ్ కు ఎడిక్ట్ అంటూ ఆమె తనతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు రాజ్ తరున్ మీడియాకు విడుదలచేసి ఇండస్ట్రీ అవాక్కయేలా చేశారు. హైదరాబాద్ లో నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కొద్దిరోజులు సాగింది. ఆ తర్వాత అతని సినిమా పురుషోత్తముడు అనే పేరుతో రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత అతనితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందురాకుండా జరిగింది.
 
ఇక, డ్రెగ్స్ తీసుకుని రేవ్ పార్టీలో సీనియర్ నటి హేమ వున్నట్లు రావడం, దానికి ఆమె ఖండించడం జరిగింది. కానీ ఫైనల్ గా బెంగుళూరు పోలీసులు ఆమె వుందని ధ్రువీకరించడం జరిగినా, ఆ తర్వాత ఆమె విమర్శలు గుప్పించడం జరిగాయి. ఇదే ఇష్యూలో దర్శకుడు క్రిష్ కూడా వున్నాడు. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీలో అతను ఉన్నట్లు రావడం, వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవాల్సివచ్చింది.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంతకుముందు వున్న వైసీపీ పార్టీకి సపోర్ట్ వుంటూ పలు వీడియోలు, సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ వివాదంగా మారాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు చేయడం, వ్యక్తులను టార్గెట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన తీసిన వ్యూహం సినిమా కూడా మరింత వివాదంగా మారింది. సైబర్ నెట్ అనే సంస్థనుంచి చట్టవ్యతిరేకంగా రెండుకోట్ల రూపాయలు తీసుకున్నాడనీ,  అసలు సబ్ స్పైర్ లేని ఓటీటీలో ప్రదర్శించి అప్పటి వైసిపీ ప్రభుత్వం నుంచి నిధులు జేచిక్కించుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇంకా కేసు కొనసాగుతుంది.
 
అలాగే వైసీపికి వత్తాసు పలుకుతూ నటుడు అలీ, పోసాని క్రిష్ణ మురళీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు కూడా మరింత వివాదంగా మారాయి. పొలిటికల్ గా దాడి పెరగడంతో వాటికి తట్టుకోలేక ఇద్దరూ తాము అసలు రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయాల్సివచ్చింది. అదేవిధంగా హిట్ మోజులో వున్న నటి శ్రీలీల కూడా ఓ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయపార్టీపై కోపాన్ని తెప్పించడంతో ఆమె కూడా సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
 
ఇదంతా ఓ భాగమైతే, అగ్ర హీరోగా పెరుతెచ్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగార్జున కూడా వివాదాల్లోకి రావాల్సి వచ్చింది. సమంత వైవాహిక జీవితం పెటాకులయి చాలా కాలం అయింది. కానీ మళ్లీ తెరపైకి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలు పేరుతో మాదాపూర్ లోని నాగార్జునకు చెందిన ఎన్. కన్వెన్షన్ సెంటర్ లోని ఆక్రమణలకు గురయిన కొంత భాగం కూల్చేయడంతో మరింత రభస జరిగింది. చట్టపరంగానే తాను కట్టానని నాగార్జున కోర్టును ఆశ్రయించడమూ జరిగింది. ఆ సమయంలో తెలంగాణ మంత్రిణి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యానాలు పెద్ద రాద్దాంతాన్ని కలిగించాయి. అప్పట్లో సమంతను కె.టి.ఆర్. తన దగ్గరకు పంపించాలని నాగార్జునను కోరాడని అందుకు ఆయన తిరస్కరించాడంటూ కొండా సురేఖ చేసిన ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపాయి. దాంతో నాగార్జున మరింత బద్ నామ్ అయ్యాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఆమె క్షమాపణలు చెప్పీ చెప్పనట్లుగా చేసింది.
 
ఇదంతా జనాలు మర్చిపోతున్న సమయంలో మంచు మోహన్ బాబు కుటుంబం మరోసారి వెలుగులోకి వచ్చింది. షంషాబాద్ లోని ఏడెకరాలలో వున్న మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ వెళ్ళి మోహన్ బాబును కొట్టాడనేది హైలైట్ గా నిలిచింది. మోహన్ బాబు, మనోజ్ పర్సనల్ సెక్యరిటీ గొడవ వారి కుటుంబంలో ఆస్తుల వివాదాలకు ఆజ్యం పోసింది. ఎప్పటినుంచో కుటుంబాల్లో వున్న గొడవ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ వార్తలను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా విలేకరిపై మోహన్ బాబు చేయిచేసుకునే స్థాయికి చేరింది. మంచు విష్ణు హుటాహుటిన దుబాయ్ నుంచి వచ్చి సమస్య పరిష్కరిస్తానని ప్రకటించినా సాల్వ్ కాలేదు. పైగా మోహన్ బాబుపై కూడా కేసు బలంగా వుంది. కొద్దిరోజులు సద్దుమణుగుతుంది అనగా తాజాగా విష్ణు, తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని మనోజ్ మరో బాంబు పేల్చాడు. ఇలా మంచు ఫ్యామిలీ కెరీర్ మంచులా కరిగిపోయేలా సంఘటనలు జరిగాయి. 
 
మోహన్ బాబు ఇష్యూ హాట్ గా వుండగానే,  అల్లు అర్జున్ ఇష్యూ ఒక్కసారిగా హైలైట్ అయింది. పుష్ప 2 సినిమా రిలీజ్ కుముందు డిసెంబర్  4న సంథ్యథియేటర్ లో  సినిమా చూడడానికి వచ్చిన రేవతి చనిపోవడం, కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళడం జరిగాయి. అల్లు అర్జున్ రావడం వల్లే ఇలా జరిగిందనీ పోలీసులు, కాదు అని మేనేజ్ మెంట్ వాదులాడుకోవడం జరిగాయి. దాంతో ఆమె బర్త భాస్కర్ కేసు వేయడంతో దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎట్టకేలకు 11వ ముద్దాయిగా అల్లు అర్జున్ ను పెట్టడంతోపాటు షడెన్ గా అతన్ని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలులో ఓ రాత్రంతా వుంచడం విశేషం.
 
ఆ తర్వాత ఆ ఇష్యూను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఓవైసీ అడిగిన ప్రశ్నకు పూజగుచ్చినట్లు పోలీసులు చెప్పిన వివరాలను బట్టి ఓపిగ్గా గంటకుపైగా చర్చ జరిపారు. ఇక అదేరోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి, నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదనీ, కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని నొక్కి చెప్పారు. అది మరింత వివాదంగా మారి ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన జె.ఎన్.జె. సభ్యులు కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేయడం,  ఆ తర్వాత వారు కోరినట్లు 2 కోట్ల రూపాయలు రేవతికుటుంబానికి అందజేయడం చకచకా జరిగాయి. ఇవేవీ పట్టించుకోని ప్రేక్షకులు పుష్ప 2 సినిమాను మాత్రం తెగ ఆదరించేశారు.
 
ఇలా అల్లు అర్జున్ విషయం రీత్యా, ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంచమని రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు సినీ పెద్దలను రేవంత్ రెడ్డితో భేటీకి ఏర్పాటు చేశారు. అక్కడ ట్విస్ట్ ఏమంటే, తమ ప్రభుత్వం చేసే పలు కార్యక్రమాలకు ప్రచారకర్తలుగా వుండాలని ఇండస్ట్రీకి మెలిక పెట్టడం ఈ ఏడాది ప్రత్యేకత. వివిధ పార్టీలకు చెందిన సినీ ప్రముఖులు దీనికి ఏవిధంగా స్పందిస్తారో తెలీదుకానీ, ప్రస్తుతానికి అందరూ గుంభనంగా వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌తో చర్చించిన విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

ఆది పినిశెట్టి క్రైమ్ థ్రిల్లర్ శబ్దం విడుదలకు సిద్ధమవుతోంది

ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు లెండి.. పూనమ్ కౌర్ వ్యంగ్యాస్త్రాలు

కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో షురూ కానుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments