Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెను బ్యాగులో పెట్టుకుని తిరిగే ఈ మహిళ గురించి తెలిస్తే..?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:56 IST)
Selwa Hussain
ఓ మహిళ గుండెను బ్యాగులో పెట్టుకుని తిరుగుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. బ్రిటన్‌కు చెందిన సెల్వా హుస్సేన్‌కు 39 ఏళ్లు. ఈమె భర్త పేరు ఏఐ. వీరికి ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కూతురు ఉన్నారు. వీరి స్వస్థలం బ్రిటన్‌లోని లండన్. ఐతే ఇటీవల సెల్వా హుస్సేన్.. కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. 
 
తమ ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లి శ్వాస తీసుకోలేకపోతున్నాని చెప్పి బాధపడింది. అక్కడి నుంచి స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో చేరింది సెల్వా. గుండె పరీక్షలు చేస్తే రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. ఆమెకు తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నందున సెల్వా హుస్సేన్‌ను ప్రపంచ ప్రఖ్యాత హేర్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.
 
ఆమె ప్రాణాలను కాపాడేందుకు కార్డియాలజిస్ట్‌లు ఎంతో శ్రమించారు. చివరకు ఆమె గుండె పనిచేయదని నిర్ధారణకు వచ్చి.. కృత్రిమ గుండెను అమర్చాలని నిర్ణయించారు. సెల్వా హస్సేన్‌తో పాటు ఆమె భర్త అంగీకారం తీసుకున్న తర్వాత.. ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేశారు. అనంతరం సెల్వా శరీరం నుంచి గుండెను తొలగించి కృత్రిమ హృదయాన్ని అమర్చారు. 
 
కృత్రిమ గుండెను ఓ బ్యాగ్‌లో సెటప్ చేశారు లండన్ డాక్టర్టు. అందులో రెండు బ్యాటరీలు, మోటార్, పంప్ ఉంటాయి. దాని నుంచి రెండు పైపులు ఆమె ఛాతీ భాగం నుంచి శరీరం లోపలికి వెళ్తాయి. బ్యాగ్‌లో ఉన్న మోటార్ సాయంతో శరీరం లోపల ఉన్న రెండు బెలూన్లకు నిరంతరం గాలిని పంప్‌ చేస్తుండాలి. ఆ రెండు బెలూన్లు గుండె చాంబర్లుగా పనిచేస్తాయి. అక్కడి నుంచే రక్తం శరీరంలోని ఇతర భాగాలకు పంప్ అవుతుంది. ఇలా కృత్రిమ గుండెను నిమిషానికి 138 సార్లు కొట్టుకునేలా సెట్ చేశారు.
 
నిరంతర పంపింగ్ కారణంగా ఆ మోటర్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అందుకే సెల్వా బ్యాక్‌ప్యాక్ నుంచి మోటార్ శబ్ధం వినిపిస్తూనే ఉంది. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోతే వెంటనే మార్చేయాలి. అది కూడా 90 సెకన్లలోనే మార్చేయాలి. లేదంటే పంపింగ్ ఆగిపోయి.. శరీరానికి రక్త సరఫరా నిలిచిపోతోంది. అందుకే ఆమె వెంట ఎప్పుడూ రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకటి అయిపోగానే.. మరొక దానిని కనెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో రెండో దానికి చార్జింగ్ పెడుతుంది. సెల్వా హుస్సేన్ ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే బ్యాగ్ తీసుకెళ్తుంది. అంతేకాదు సెల్వా భర్త ఏఐ కూడా అనుక్షణం ఆమె వెంటనే ఉంటారు.
 
ఇంతకు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్‌కు ఎంత ఖర్చయిందో తెలుసా..? 86,000 యూరోలు.. అంటే మన కరెన్సీలో రూ.78 లక్షలు. ఇది కేవలం కృత్రిమ గుండెకు అయిన ఖర్చు మాత్రమే. ఆపరేషన్, ఇతర ఖర్చులు అదనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments