విజేతలైన మహిళలు ఆదివారం పాటించే నియమాలేంటో తెలుసా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:27 IST)
సాధారణంగా మహిళా ఉద్యోగినులకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టకూడదు. అసలు విజేతలైన మహిళలు ఆదివారం పాటించే నియమాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
సాధారణ రోజుల్లో ఏ పనులు ఎప్పుడు చేయాలో ఓ ప్రణాళిక వేసుకుంటాం.. అదేవిధంగా ఆదివారం రోజున కూడా పాటించాలి. ఉదాహరణకు ఓ గంట దుస్తుల కోసం కేటాయించండి. వారం మొత్తానికి ఏం వేసుకోవాలనేది సిద్ధంగా పెట్టుకుంటే మిగిలిన రోజుల్లో ఎంతో సమయం కలిసొస్తుంది. తప్పక ప్రయత్నించి చూడండి. 
 
ఆదివారం రోజున కనీసం ఓ అరగంట అయినా.. రాబోయే వారం రోజులు ఏయే పనులు చేయాలో ఆలోచించుకోవాలి. అవసరమైతే కొన్నింటిని రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనకు ఏం చేయాలో తెలుస్తుంది. మర్చిపోయే పరిస్థితి ఎదురుకాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి సమస్య అసలు ఉండదు. 
 
ఇక ఇంటిని సర్దుకునే పనులు మాత్రం పెట్టుకోరట చాలామంది. అందుకు బదులుగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించుకుంటారు. అలానే వారంలో ఎంత సమయం కుటుంబానికి కేటాయించాలి.. వ్యక్తిగత సమయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆలోచిస్తారు. 
 
విజేతలైన స్త్రీలు చేసే మరో పని ఏంటో తెలుసా.. డిజిటల్ డిటాక్స్ పాటించడం. అంటే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు దూరంగా ఉండడం. రోజంతా కాకపోయినా.. వీలైనన్ని ఎక్కువ గంటలు అలా గడిపేందుకు ప్రయత్నిస్తే చాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దపిల్లి అనుకుని పెద్దపులికి బీర్ తాపించబోయాడు.. ఇది రియల్ వీడియోనా లేదా ఏఐ వీడియోనా?

ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని వెళ్లిపోయిన పులి (video)

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

తర్వాతి కథనం
Show comments