బొప్పాయి గుజ్జు ముఖానికి పట్టిస్తే..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (15:51 IST)
చలికాలంలో చాలామందికి ముఖం పొడిబారి చర్మమంతా అలసట, నీరసంగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం లభించాలని రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌‌లు వాడుతుంటారు. దాంతో సమస్య మరింత ఎక్కువగా మారుతుంది. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చును.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
తప్పకుండా అందరూ ప్రతిరోజూ స్నానం చేస్తూనే ఉంటారు. అయినా చర్మమంతా తెల్లతెల్లగా మారి దురదలు పెడుతూ వుంటుంది కొందరికి. అలాంటప్పుడు స్నానానికి వాడే సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించాలి. 
 
ఒక పెద్ద అరటిపండును తొక్కతీసి.. పండును గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో 2 స్పూన్ల గులాబీ నీరు కొద్దిగా తేనె, పాలపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుని పొడి టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
బొప్పాయి పండు ఈ సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఓ బొప్పాయి పండు రెండు సగాలుగా కట్ చేసి వాటిలోని గింజలు తీసేయాలి. ఆ తరువాత దాని తొక్కను తీసి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఆపిల్ రసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. రెండుగంటల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చాలు. చర్మం సున్నితంగా తయారవుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు

ఏపీలో తీవ్రమైన వడగాలులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు

Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

తర్వాతి కథనం
Show comments