Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లోనే నిద్రలేమి సమస్య ఎక్కువ.. పురుషులు హాయిగానే నిద్రపోతారట..!?

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆధునిక యుగంలో నిద్ర బాగా కరువైంది. ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకుంటూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోని మహిళల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. కుటుంబం కోసం కార్య

Webdunia
గురువారం, 21 జులై 2016 (17:39 IST)
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆధునిక యుగంలో నిద్ర బాగా కరువైంది. ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకుంటూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోని మహిళల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. కుటుంబం కోసం కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని.. ఇంట్లోనూ పనులు చక్కబెట్టుకుని నిద్రపోయేందుకు పదో, పదకొండో కావచ్చు. 
 
ఇక శరీరం అలసిపోయింది హాయిగా నిద్రపడుతుందిలే అనుకునే మహిళలు కంటిపై నిద్రలేకుండా బాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా పడుకున్న వెంటనే మహిళలు నిద్రలోకి జారుకోవట్లేదు. భర్త, పిల్లలు, ఆర్థిక పరిస్థితి, కార్యాలయ ఒత్తిడి వంటి ఇతరత్రా సమస్యలన్నీ నిద్రించేందుకు ముందు వారి కంటి ముందు నిలబడితే.. ఇక నిద్రలేమి సమస్య వేధించక మానట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిందని చెప్తున్నారు. నిద్రలేమి సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. 
 
పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో 1.4 శాతం తక్కువ నిద్రపోతారని వీరి పరిశోధనల్లో వెల్లడైంది. 20-30, 40-50 సంవత్సరాల మధ్య వయస్సుగల స్త్రీలలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
నిద్రలేమికి అనేక రకాల కారణాలు ఉన్నా స్త్రీలలో మాత్రం ఒత్తిడి, ఆందోళనే ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటికి తోడు హార్మోన్లలో తేడాలు, మెనోపాజ్‌ వంటివి కూడా కారణమని పరిశోధకులు తేల్చారు. అయితే నిద్రలేమితో మహిళల్లో ఊబకాయం, గుండె సంబంధ సమస్యలతో చిన్న వయస్సులోనే మృతి చెందే వారి సంఖ్య అధికమవుతుందని పరిశోధకులు తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments