Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులో రోజంతా ఏసీలో ఉంటున్నారా? వీటిని పాటిస్తే?

చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుస

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (15:36 IST)
చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ఏసీ వలన వచ్చే చల్లటి గాలిలో తేమ ఎక్కువగా ఉండదు. కాబట్టి చర్మానికి కావలసిన తేమ అందాలంటే వీలైనంత వరకు నీళ్లను ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. దాంతోపాటే రెండు గంటలకొకసారైనా ఓ 5 నిమిషాల పాటు కారిడార్‌లో అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి. క్లెన్సర్లూ, ఫేస్‌వాష్‌లు వాడుతున్నట్లైతే వాటిలో నురుగు రాకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.
 
అలాగే రెండుగంటలకోసారి చల్లని నీటితో ముఖాన్ని తుడుచుకోవాలి. చర్మం ఎక్కువగా పొడిబారుతుంటే స్వయంగా తేమను అందించే ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపాటి హ్యుమిడిఫయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ధర తక్కువగానే ఉంటుంది. అలాకాకుంటే ఆఫీసు డెస్కు మీద గాజు పాత్ర ఉంచి అందులో నీళ్లు పోసి కొన్ని పూల రెక్కల్ని వేయాలి. ఈ అమరిక చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. తేమని అందించడంలో తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

తర్వాతి కథనం
Show comments