Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో జుట్టును రక్షించుకోవడం ఎలా?

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (11:26 IST)
చలికాలంలో చర్మం మాదిరిగానే జుట్టు కూడా త్వరగా పాడవుతుంది. జుట్టు రాలిపోవటం, చుండ్రు వంటి సమస్య పెరుగుతాయి. ఇలాంటి సమస్యల నుంచి జుట్టును రక్షించుకోవటానికి ఇంట్లో సులభంగా తయారుచేసుకొనే కొన్ని హెయిర్‌ మాస్క్‌లను చూద్దాం.
 
ఆలివ్‌ నూనెతో..
ఆలివ్‌ ఆయిల్‌ను రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. గోరు వెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్‌నూనెను పట్టించి ఉదయాన్నే జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు పోతాయు.
 
తేనెతో.. 
ఒక కప్పులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను తీసుకుని అందులోకి కోడిగుడ్డులోని పచ్చసొనను వేసి మిశ్రమంగా కలపాలి. దాంతో జుట్టుకు అరగంటపాటు మర్దనా చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
 
అలొవిరాతో..
అలొవిరా ఆకుల నుంచి జెల్‌ను తయారు చేసుకుని అందులోకి నిమ్మరసం, ఆలివ్‌నూనె., కొబ్బరినూనెలను ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలపాలి. దీన్ని మిశ్రమంగా కలిపి జుట్టుకు కుదుళ్ల దాకా పట్టించి అరగంట తర్వాత శుభ్రపరిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
 
పెరుగుతో.. 
ఒక కప్పులో ఒక కోడిగుడ్డు సొనను వేసి దానిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పేస్ట్‌లా పూయాలి. బాగా ఆరిన తర్వాత దీనిని చల్లటి నీటితో కడగాలి. 

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments