Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

కరక్కాయ చూర్ణం తేనెతో సేవిస్తే ఏం జరుగుతుంది?

Advertiesment
hair growth in bald head tips in telugu
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (21:38 IST)
ఆయుర్వేదంలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో చిట్కాలు వున్నాయి. చిన్నచిన్న చిట్కాలతో దీర్ఘకాల వ్యాధులను సైతం తగ్గించుకునే అవకాశం వున్నది. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. వేప చిగుళ్లు, పసుపు కలిపి నీటిలో మర్దించి పైన పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చెమటకాయలు క్రమేణా తగ్గిపోతాయి.
 
ప్రతిరోజూ 3 గ్రాముల కరక్కాయ చూర్ణం తేనెతో సేవించే వారికి వెంట్రుకలు నెరవవు. రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి మెత్తగా దంచి నెయ్యిలో వేయించి తీసుకుంటే రక్తంలో అధిక కొవ్వు శాతం తగ్గుతుంది. మామిడి ఆకులలోని ఈనెలు తీసి నీడలో ఆరబెట్టి మెత్తటి చూర్ణంగా చేసి దానికి బట్టలసోడా, తగు సున్నం కలిపి పులిపిర్లు పైన పట్టిస్తే క్రమేణా తగ్గుతాయి.
 
రావి, మామిడి, చింత పట్టలు సమంగా తీసుకుని ఎండబెట్టి, కాల్చి బూడిదగా చేసి దానికి కొద్దిగా వెన్న కలిపి చర్మరోగాలైన గజ్జి, గాయాలకు రాస్తుంటే తగ్గిపోతాయి. సీతాఫలం గింజలను మేకపాలతో మెత్తగా నూరి తలకు లేపనం చేస్తుంటే బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయి.
 
పారిజాతం ఆకుల కషాయం రెండు పూటలా వారం రోజులు సేవిస్తే ఒంటికాలు నొప్పి తగ్గుతుంది. అల్లం రసంలో నీలగిరి తైలం కలిపి నడుమునొప్పి వున్నచోట రాస్తుంటే సమస్య తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెను ఎలా సేవించాలో తెలుసా?