Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి పిల్లలు పుడతారంటూ...భార్యను బజారుపాలు చేసిన చదువుకున్నోడు.. వీడూ మగాడే..!

చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ఉర్రూతలూగించింది. ఎంబీఏ చదువుకోసం ఆస్ట్రేలియా వరకూ దేగిన ఒక మగ మృగం భార్యను బజారు పాలు చేసింది. ఆమె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వీడియోలను స్నేహితులకు షేర్ చేయడమే కాదు భార్యకు మ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (04:38 IST)
చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ఉర్రూతలూగించింది. ఎంబీఏ చదువుకోసం ఆస్ట్రేలియా వరకూ దేగిన ఒక మగ మృగం భార్యను బజారు పాలు చేసింది. ఆమె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వీడియోలను స్నేహితులకు షేర్ చేయడమే కాదు భార్యకు మత్తుమందిచ్చి వేరొకరితో అత్యాచారం చేయించాడు. పైగా మంచిబిడ్డలు పుడతారంటూ ఒక దొంగ బాబాకు కట్టబెట్టాలని చూశాడు. ఇక ఆ మృగం తల్లి, సోదరి ఎలాంటి వారంటే ఇలాంటివన్నీ ఉన్నత కుటుంబాల్లో సహజం అంటూ సమర్థించారు. ఇదేం ఉన్నతం అని ఛీదరించకున్న ఆ భార్య పోలీసులకు రిపోర్ట్ చేస్తే ఇప్పుడు ఊచలు లెక్కబెడుతూ ఉన్నత కుటుంబాల గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు.
 
పాతబస్తీ హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన సనా ఫాతిమా (26), మాదన్నపేట సాలార్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సలీముద్దీన్‌ (28)లకు గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఎంటెక్‌ చదివేందుకు సలీముదీన్‌ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పాశ్చాత్య పోకడలకు అలవాటుపడ్డ సలీముద్దీన్‌ తరచూ మాదన్నపేటలో ఉంటున్న భార్యకు వీడియోకాలింగ్‌ చేసేవాడు. తనతో నగ్నంగా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ వీడియో కాల్స్‌ను రికార్డు చేసిన సలీముద్దీన్‌... వాటిని వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు షేర్‌ చేశాడు.
.
సనా ఉండే ఇంట్లోనే కింది భాగంలో ఆమె అత్త నూర్జహాబేగం నివసిస్తోంది. సలీముద్దీన్‌ స్నేహితుడైన వట్టేపల్లివాసి చాంద్‌ తరచూ నూర్జహా ఇంటికి వచ్చిపోతుంటాడు. అతడు సనాతో అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడు. ఇది తెలిసినా పట్టించుకోని నూర్జహా... చాంద్‌ను ప్రొత్సహిస్తూ వచ్చింది. గత నెలలో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన సలీముద్దీన్‌... తన సెల్‌ఫోన్‌లో ఉన్న భార్య ‘దృశ్యాలను’చాంద్‌కు చూపించాడు. అదే సందర్భంలో ఆమెపై మోజు ఉన్న విషయాన్ని చాంద్‌ చెప్పాడు. మందలించాల్సిన సలీముద్దీన్‌... తన భార్యపై అత్యాచారానికి సహకరిస్తానంటూ ప్రోత్సహించాడు. ఈ నెల 4న సనాకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చిన సలీముద్దీన్‌... ఆమె మత్తులోకి జారుకోగానే చాంద్‌ను పిలిచి అత్యాచారం చేయించాడు.
 
హఫీజ్‌బాబానగర్‌లోని ఓ దర్గాలో ఉండే బాబా అంటే సలీముద్దీన్‌కు అమితమైన భక్తి. స్వదేశానికి ఎప్పుడు వచ్చినా మొదటగా ఆ బాబా దర్శనం చేసుకున్నాకే ఇంటికి వెళతాడు. సదరు బాబాతో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని, అప్పుడే తమకు మంచి పిల్లలు పుడతారంటూ భార్యపై సలీం ఒత్తిడి చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు బాబాను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు.
 
జరిగిన ఘోరాన్ని సనా తన అత్త, ఆడపడుచులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా... ఉన్నత కుటుంబాల్లో ఇవన్నీ సహజమేనని, సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. దీంతో దిక్కుతోచని బాధితురాలు శనివారం కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భర్త సలీముద్దీన్, అత్త నూర్జహాను అరెస్టు చేశారు. సలీముద్దీన్‌ మంగళవారం ఆస్ట్రేలియా తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. పరారీలో ఉన్న చాంద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments