Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 22, రేపే వినాయక చవితి, ఎలాంటి గణపతికి పూజలు చేయాలి?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:22 IST)
వినాయక చవితి 2020
రేపే వినాయక చవితి. రేపు ఉదయాన్నే అంతా బొజ్జ గణపయ్య మట్టి విగ్రహాలను కొనేందుకు వెళుతారు. ఐతే వినాయక విగ్రహం ఎలా వుండాలన్నది చూసుకోవాలి. వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి’ అంటారు.
 
తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి’ అని అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి పూజలు చేయరాదు. గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటాము. ఈ గణపతికి పూజలు చేయరాదు. 
 
గణపతికి వాహనము ఎలుక. కావున మనము పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగముగా ఉండాలి. గణపతికి యజ్ఞోపవీతము ఉండవలెను. పామును యగ్నోపవీతముగా ధరించి ఉన్న గణపతిని పూజించవలెను. గణపతి ముఖములో చిరునవ్వు ఉండాలి. మనము పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండాలి. 
 
అందుకే మనం "ప్రసన్న వదనం ధ్యాయేత్" అని ఆయనను పూజిస్తాము. గణపతిని రెండవ రోజు(పూజ పక్కరోజు) కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటుపక్క రోజు(3వ రోజు) కదిలించి తీయవచ్చు. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

తర్వాతి కథనం
Show comments