Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చల్లచల్లని.. ఫ్రూట్ సలాడ్ చేయడం ఎలా? (వీడియో)

ముందుగా పండ్లను శుభ్రంగా నీటితో కడిగి.. ఆపై వాటిని మీకు ఇష్టమొచ్చినట్లు కట్ చేసి పక్కనబెట్టుకోవాలి. ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, అరటి ముక్కలను విడివిడిగా కట్ చేసుకున్నాక.. వాటిని ఓ వెడల్పాటి ప్లేటులో

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (18:36 IST)
వేసవిలో చల్లచల్లని.. ఫ్రూట్ సలాడ్‌ టేస్ట్ చేస్తే ఎలా వుంటుంది. ఆ ఫ్రూట్‌ సలాడ్‌ను ఐస్‌క్రీమ్‌తో రుచి చూస్తే ఆ టేస్టే వేరు. పోషకాలతో నిండిన సూపర్ ఫ్రూట్స్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
ద్రాక్ష - ఒక కేజీ 
పుచ్చకాయ - ఒకటి 
బొప్పాయి- ఒకటి 
అరటి పండ్లు - నాలుగు 
ఆపిల్ - నాలుగు 
ఐస్ క్రీమ్ - ఫ్యామిలీ ప్యాక్ - 1
 
తయారీ విధానం: 
ముందుగా పండ్లను శుభ్రంగా నీటితో కడిగి.. ఆపై వాటిని మీకు ఇష్టమొచ్చినట్లు కట్ చేసి పక్కనబెట్టుకోవాలి. ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, అరటి ముక్కలను విడివిడిగా కట్ చేసుకున్నాక.. వాటిని ఓ వెడల్పాటి ప్లేటులో వేసి కలుపుకోవాలి. ఇలా ద్రాక్ష, పుచ్చ, బొప్పాయి, అరటి, ఆపిల్ ముక్కలన్నీ మిక్స్ అయ్యాక వాటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని.. ఆ బౌల్‌లో ఐస్ క్రీమ్ ఓ స్పూన్ చేర్చి సర్వ్ చేయొచ్చు. అంతే ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే. 
 
ఈ ఫ్రూట్ సలాడ్‌లో బోలెడు పోషకాలున్నాయి. పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ధాతువులున్నాయి. ఈ పండ్లను మిక్స్ చేసుకుని తీసుకునేందుకు ఇష్టపడని పిల్లలకు ఐస్‌క్రీమ్‌తో సహా సర్వ్ చేస్తే.. వారు ఇష్టపడి తింటారు. 
 
ఫ్రూట్ సలాడ్ ప్రయోజనాలు.. 
మనం తయారు చేసిన ఫ్రూట్ సలాడ్‌లో ద్రాక్ష, పుచ్చకాయ, అరటి, యాపిల్, బొప్పాయి పండ్లను ఉపయోగించాం. వీటిలో మొదటిదైన ద్రాక్షలో సహజంగా ఉండే ఎ, బి1, బి12, సి విటమిన్లతో పాటు క్యాల్షియం, ఐరన్‌, క్లోరిన్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రోజూ ద్రాక్షపండ్లను తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక పుచ్చకాయలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వుంటాయి. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మస్య‌లను కూడా పుచ్చకాయ నయం చేస్తుంది. 
 
వేసవికి పుచ్చకాయ చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరుతుంది. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు క్యాన్సర్‌కి, అలాగే మధుమేహాన్ని పుచ్చకాయ దరిచేరనివ్వదు. ఇక అరటి పండులో వుండే కెరొటినాయిడ్స్ లివర్‌నే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. 
 
అరటిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా వుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. ఇక చివరిగా బొప్పాయి సంగతికి వస్తే.. బొప్పాయి ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తుంది. బొప్పాయిని డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments