Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే..? పెరుగులో ముంచిన ద్రాక్షల్ని?

వేసవికాలం వచ్చేసింది.. ఎండలను తెచ్చేసింది.. మండిపోతున్న ఎండల్లో శరీర తాపాన్ని తగ్గించుకునేందుకు పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుక

వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే..? పెరుగులో ముంచిన ద్రాక్షల్ని?
, బుధవారం, 21 మార్చి 2018 (13:42 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఎండలను తెచ్చేసింది.. మండిపోతున్న ఎండల్లో శరీర తాపాన్ని తగ్గించుకునేందుకు పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.. 
 
కీరదోసను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులోని లో-కెలోరీలు, ఫైబర్, యాంటీ-యాక్సిడెంట్లు, నీటి శాతం మధుమేహాన్ని తగ్గిస్తుంది. వేసవిలో రోజూ కీరదోసను తీసుకోవడం మరిచిపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ద్రాక్ష రసం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మైగ్రేన్‌ను తగ్గించే వీటిలో పొటాషియం పుష్కలంగా వుంటుంది.
 
వృద్ధాప్య ఛాయలను ఇది పోగొడుతుంది. పెరుగులో ముంచిన ద్రాక్షలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పాటు ఆరెంజ్, పుచ్చకాయ, ఆపిల్, స్ట్రాబెర్రీ, కివీ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వేసవికాలంలో డీ-హైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. 
 
అలాగే వేసవిలో ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు, గుడ్డు, పాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వెల్లుల్లి వంటల్లో అధికంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో జామకాయను తీసుకోవాలి..