Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకుతో పచ్చడిని టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (13:19 IST)
మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్ వున్నాయి. వీటిని సుధీర్ఘకాలంపాటు ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎనీమియా, ఆర్థరైటిస్, లివర్ వ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. అలాంటి మునగాకుతో పచ్చడి చేసుకుంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
కావలసిన పదార్థాలు :
లేత మునగాకు - 2 కప్పులు, 
చింతపండు, ఉప్పు - రుచికి సరిపడా, 
వెల్లుల్లి - 10 రెబ్బలు
కరివేపాకు - 4, రెబ్బలు,
ఆవాలు - ఒక టీ స్పూను, 
నూనె - ఒక టేబుల్‌ స్పూను, 
ఎండుమిర్చి, పచ్చిమిర్చి.
 
తయారీ విధానం : ముందుగా నూనెలో ఎండుమిర్చి, పోపు దినుసులు వేయించి కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరో పెద్ద బాణలిలో మునగాకు వేగించి ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు వేసి మూతపెట్టాలి. ఆకులు మగ్గిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి. దీనిని పచ్చడిలా రుబ్బుకుని పోపు పెట్టుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments