Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒకటిన్నర కప్పు క్యాప్సికం - 1 నూనె - 3 స్పూన్స్ టమోటా - 1 ఉల్లిపాయ తరుగు - అరకప్పు పచ్చిమిర్చి - 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ ధనియాల పొడి - 1 స్పూన్ పసుపు

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:23 IST)
కావలసిన పదార్థాలు: 
బియ్యం - ఒకటిన్నర కప్పు 
క్యాప్సికం - 1 
నూనె - 3 స్పూన్స్ 
టమోటా - 1 
ఉల్లిపాయ తరుగు - అరకప్పు 
పచ్చిమిర్చి - 4 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
ధనియాల పొడి - 1 స్పూన్ 
పసుపు - చిటికెడు 
ఉప్పు - తగినంత 
కారం - 1 స్పూన్ 
పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు 
కొత్తిమీర - కొద్దిగా 
లవంగాలు - 4 
యాలకులు - 4 
దాల్చిన చెక్క - అంగుళం ముక్క 
షాజీరా - 1 స్పూన్
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యం కడిగి పొడి పొడిగా వుండేట్లు అన్నం ఉడికించుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక మసాల దినుసులు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేగించి టమోటా, పనీర్‌ ముక్కలు వేసి మూతపెట్టుకోవాలి. 5 నిమిషాల తరువాత క్యాప్సికం ముక్కలు కలపాలి. క్యాప్సికం రంగు మారకుండానే అన్నం కలుపుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి. అంతే... వేడివేడి క్యాప్సికమ్ రైస్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పుట్లో ఐడియాలజీ అర్థం కాలేదు, ఆ సినిమా చేశాక ఇండియన్ 2లో ఛాన్స్ : ఎస్ జే సూర్య

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి.. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments