Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం పక్క పైనుంచి నిద్ర లేచి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు...

భారతీయ వాస్తు శాస్త్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు, సూచనలు పాటిస్తే జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి సూచనల్లో కొన్నింటిని చూద్దాం. ప్రతి రోజూ ఉదయాన్నే

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (20:33 IST)
భారతీయ వాస్తు శాస్త్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు, సూచనలు పాటిస్తే జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి సూచనల్లో కొన్నింటిని చూద్దాం. ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే పక్కమీద నుంచి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. 
 
అలాగే, ఇంట్లో పూజ గదిని తూర్పు వైపున ఉండే గోడలోనే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈశాన్య మూలలో దేవుని మందిరాల నిర్మాణం చేపట్టరాదు. దీనివలన ఈశాన్య మూల మూతపడుతుంది. ఇది ఇంటికి మంచిది కాదంటున్నారు. 
 
అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసేటపుడు ఈశాన్యం నుంచి ప్రారంభమై నైఋతి వైపునకు చెత్తను ప్రోగు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈశాన్యం వైపు చెత్తను తీసుకురాకూడదు. మన పురాణాల్లో చీపురుని శనీశ్వరుని ఆయుధంగా భావిస్తారు. అందుచేత ఇంటిని ఊడ్చిన తర్వాత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్‌ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం. ఇకపోతే.. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా ఇంటి గృహిణి నిలుచుని వంట చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తర్వాతి కథనం
Show comments