Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి మెట్లను నిర్మించాలి.. ఎలా..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:44 IST)
ఇంటి మేడ మీదకి మెట్లు నిర్మించేటప్పుడు ఒక వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మిస్తే మంచిది. మెట్లను రెండు వరుసలుగా నిర్మించాలనుకుంటే.. మొదటి వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండో వరుస మెట్లను ఎటుపక్క తిరిగినా కూడా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా ఉండాలి.
 
రెండు వరుసల మెట్లను.. ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, రెండో వరుస ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కేటట్లుగా కూడా నిర్మించుకుంటే చాలా మంచిది. ఎల్ ఆకారంలో ఇంటి మెట్లను నిర్మించాలి అనుకునేవారు ముందుగా తూర్పునుండి పడమర వరకుగానీ, ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎక్కి అటు తరువాత ఎటువైపుకైనా తిరిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
 
ఇంటికి బయటవైపున మెట్లను నిర్మించాలి అనుకుంటే.. ఈశాన్య, వాయువ్య, నైరుతి, ఆగ్నేయ దిశలలో ఏ భాగాలలనైనా నిర్మించవచ్చు. ఈశాన్య దిశగా మెట్లను నిర్మించేటపుడు ఇంటికి మార్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యాల వైపు నేరుగా ఉండేలా మెట్లు నిర్మాణం చేపట్టవచ్చు. అలానే ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీగోడకు ఏ మాత్రం తగలకుండా దూరంగా ఉండాలి. 
 
ఇంటికి బయటన మెట్లు నిర్మించినా కూడా.. ఇంటికి పడమరకంటే తూర్పు వైపున, దక్షిణం కంటే ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ స్థలాలను మెట్లు తగ్గించేలా ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments