Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లులు ఇంట్లో ఎక్కువైపోతే.. నెమలి ఈకను ఇలా వాడితే..? (Video)

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (18:41 IST)
బల్లులు ఇంట్లో ఎక్కువైపోతే.. ఇలా చేస్తే సరిపోతుంది. ఏం చేయాలంటే..? నిత్యం పూజ గదిలో వాడే కర్పూరం వాసన కూడా బల్లులకు పడదు, దాంతో ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ కర్పూరపు ఉండలు ఉంచింతే ఆ సుహాసనకు బల్లులు బయటకి పరుగులు పెడతాయి. 
 
అలాగే నెమలి ఈక అంటే అందరికీ ఇష్టమే. చాలామంది చదువుకొనే రోజుల్లో ఈ నెమలి ఈకను తమ పుస్తకాలల్లో దాచుకుంటారు. అలాంటి నెమలిక ఈకలను చూస్తే బల్లులు పారిపోతాయి. కాబట్టి బల్లులు తిరిగే ప్రాంతంలో నెమలి ఈకలను వేలాడదీయండి. అవి గాలికి ఊగేలా చేస్తే బల్లులు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాయి. 
 
ఇకపోతే.. బల్లుల బెడద వుండకూడదంటే.. ముందుగా ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. చెత్త లేకుండా చూసుకోవాలి. ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బల్లులకు వేడిగా ఉండే ప్రదేశం అంటే ఇష్టం. అందుకే ఇంటిని వీలైంతవరకు చల్లగా ఉండేలా చూసుకుంటే బల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. 
 
అలాగే రాహు దోష నివారణకు నెమలి ఈకలు బాగా పనిచేస్తాయి. రాత్రిపూట పడుకునే సమయంలో, తమ దిండు కింద ఈ నెమలి ఈకను ఉంచడం ద్వారా, రాహు గ్రహ ప్రతికూల ప్రభావాలు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చేపట్టే పనులు దిగ్విజయంగా పూర్తవ్వాలంటే.. పడక గదిలో తూర్పు లేదా ఈశాన్య మూలలో ఒక నెమలి ఈకను ఉంచడం చేయాలి. 
 
నెమలి ఈకను వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేషుని విగ్రహం లేదా నెమలి ఈకను ఉంచడం ద్వారా, వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు. అంతేకాకుండా పరిసరాలలోని వ్యతిరేక శక్తులను కూడా తొలగిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!

Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments