Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2021 : ఐటీ రిటన్స్ దాఖలు నుంచి వయో వృద్ధులకు ఊరట

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:54 IST)
దేశంలోని వయో వృద్థులకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఓ శుభవార్త చెప్పారు. ఇకపై వయో వృద్ధులు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. పెన్షన్‌, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 
 
ఇక చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో గృహనిర్మాణానికి పన్ను విరామాన్ని ప్రకటించారు. 
 
అలాగే, ల‌బ్ధిదారుల సౌక‌ర్యం కోస‌మే దేశంలో వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు స్కీమ్‌ను అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ల‌బ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మ‌రే ఇత‌ర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా స‌రుకులు తీసుకునే సౌక‌ర్యం క‌లిగింద‌ని ఆమె తెలిపారు. 
 
ముఖ్యంగా బ‌తుకుదెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వ‌ల‌స కార్మికుల‌కు ఈ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు స్కీమ్ అందుబాటులో ఉన్న‌ద‌ని ఆమె వెల్ల‌డించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments